అంతగా దమ్ము చూపించని “శైలజారెడ్డి అల్లుడు”-మూవీ రివ్యూ 2.5/5⭐⭐⭐⭐⭐

“శైలజారెడ్డి అల్లుడు” – మూవీ రివ్యూ

Casting : అక్కినేని నాగచైతన్య ,అను ఇమ్మాన్యుయెల్,రమ్యకృష్ణ, మురళీశర్మ,వెన్నెల కిషోర్ ,పృథ్వీ ,నరేష్ తదితరులు
Producers : నాగవంశీ-పీడీవీ ప్రసాద్
Music : గోపీసుందర్
Cinematographer : నిజార్ షఫి
Wirter- Director : మారుతి
కామెడీ ఎంటర్టైనర్ల దర్శకుడు మారుతీ డైరక్షన్లో నాగ చైతన్య , అను ఇమ్మాన్యుయేల్ జంటగా తెరకెక్కిన చిత్రం “శైలజారెడ్డి అల్లుడు”. ఈ చిత్రం వినాయక చవితి రోజున ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈచిత్రం ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం.(బొమ్మ పడింది)
కథ :
ఈగోకి మారు పేరైన రావు(మురళిశర్మ)కొడుకు చైతన్య(నాగచైతన్య). రావు(మురళిశర్మ) ఈగో వల్ల సొంత కూతురి పెళ్ళి కుడా చెడిపొతుంది. కరెక్ట్ గా అలాంటి ఈగో ఉన్న అమ్మాయి అను(అను ఇమ్మాన్యుయెల్)ని చూసి ప్రెమలో పడతాడు చైతు. ఆ క్రమంలో చైతు అనును మార్చి.. తన ప్రేమను చెప్పి.. ఇద్దరు ఒక్కటవుతారు. కానీ చైతూ తండ్రి తొందరపాటు వల్ల అనుకోని పరిస్థితుల్లో వీళ్లిద్దరి నిశ్చితార్థం జరిగిపోతుంది. అప్పుడే వరంగల్ జిల్లాలో పెద్ద నాయకురాలైన శైలజారెడ్డి (రమ్యకృష్ణ) గురించి.. ఆమె ఇగో గురించి చైతూ కుటుంబానికి తెలుస్తుంది.ఈవిషయం అను తల్లి (శైలజారెడ్డి)కి తెలియనివ్వకుండా జరుగుతుంది. మహా కోపిష్టి అయిన శైలజారెడ్డి తనకు తెలియకుండా జరిగిన కూతురి నిశ్చితార్థం గురించి తెలుసుకుని ఏం చేసింది.. ఆమెను చైతూ ఎలా డీల్ చేశాడు.. అనేది మిగితా కథ ..
విశ్లేషణ – సాంకేతికవర్గం:
ఈగో ఫ్యామిలీలో పాజిటివ్ థింక్ ఉన్న కుర్రాడిలా నాగ చైతన్య చాలా బాగా చేసాడు. అను ఇమ్మాన్యుయేల్ చాలా పద్దతిగా బాగా నటించింది. ఈగో క్యారక్టర్ గా మురళిశర్మ బాగానే చేసిన అంతగా ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వదు. రమ్యకృష్ణ క్యారక్టర్ లో అంత దమ్ములేదు. వెన్నెల కిషోర్,పృద్వి కామెడి పర్వాలేదు అనిపించింది. సెకెండ్ హఫ్ లో బాగానే నవ్వించారు. పాటలు టైటిల్ సాంగ్, మరో సాంగ్ తప్ప పెద్దగా బాగలేవు. మారుతి తీసుకున్న కాన్సెప్ట్ పాతది. కధ అంత బలంగా లేదు. సినిమాటొగ్రపి బాగనే ఉంది. నిజార్ షఫీ అందించిన ఛాయా గ్రహణం సినిమాకు హైలైట్ గా నిలిచింది. గోపిసుందర్ అందించిన సంగీతం పర్వాలేదు. కోటగిరి వెంకటేశ్వరరావు అందించిన ఎడిటింగ్ బాగుంది.
+Points:
హీరో- హీరోయిన్ల నటన
టైటిల్ సాంగ్
-Points :
పాత కధ
క్యారక్టర్స్ లో దమ్ము లేదు
అనుకున్నంత కామెడి లేదు
బొమ్మపడింది మాట: కలెక్షన్ల పరంగా అయితే మంచి లాభాలు రావొచ్చెమోగాని, సినిమా మాత్రం నాగచైతన్య కేరీర్లో బిగ్గెస్ట్ హిట్ అయితే కాకపోవచ్చు. For More Reviews : www.bommapadindi.com 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *