అసలు “కంచరపాలెం” లో ఏం జరిగింది??

c/o”కంచరపాలెం” సమీక్ష

 

ఓ చిన్న సినిమాకు విడుదలకు ముందే క్రేజ్ రావడం అరుదుగా జరుగుతుంటుంది. అలాంటిదే కంచరపాలెం సినిమాకి వచ్చింది.. నూతన దర్శకుడు మహా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కేరాఫ్ కంచెర పాలెం’. ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ పతాకం పై ‘రానా దగ్గుబాటి’ సమర్పిస్తున్న ఈ చిత్రానికి స్వీకర్ అగస్తి సంగీతం అందించారు. ఇక ఈ సినిమాలో ప్రేమ, కామెడీ, మరియు కులం, మతం వంటి సున్నితమైన అంశాలను వాటి వల్ల మనుషులు పడుతున్న ఇబ్బందలను చూపించటం నేటి సమాజంలో కూడా కొంతమంది కుల మత పిచ్చితో ఎంత మూర్ఖంగా ఉంటారో అని కొన్ని కఠినమైన వాస్తవాలను చాలా వాస్తవికంగా చూపించటం ఆకట్టుకుంటుంది.
ఐతే ఈ కథ తయారు చేయడానికి ముందే దర్శకుడు వైజాగ్ శివార్లలోని కంచరపాలెం ఊరికి వెళ్లాడని.. కొన్ని నెలల పాటు అక్కడే ఉండి.. అక్కడి మనుషుల్ని వాళ్ల నేపథ్యాల్ని.. కథల్ని అధ్యయనం చేసి.. వాటి ఆధారంగా కథ తయారు చేసుకుని.. అక్కడి వ్యక్తుల్నే ప్రధాన పాత్రలకు ఎంచుకుని.. ఆపై అక్కడే సినిమా కూడా తీశాడని, నిర్మాత సురేష్ బాబు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *