‘ఆటగాళ్ళు’ మూవీ రివ్యూ | 2.5/5⭐⭐⭐⭐⭐

Movie : ఆటగాళ్ళు

Cast : నారా రోహిత్, జగపతి బాబు, దర్శన బానిక్, సుబ్బరాజు, బ్రహ్మానందం

Music : సాయి కార్తీక్‌

Producer : వాసిరెడ్డి రవీంద్రనాథ్, వాసిరెడ్డి శివాజీ ప్రసాద్, మక్కెన రాము, వడ్లపూడి జితేంద్ర

Director : పరుచూరి మురళి

వైవిధ్యమైన పాత్రలతో సినిమాలతో ప్రేక్షకులను అలరించే యంగ్ హీరో నారా రోహిత్ మరో డిఫరెంట్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆయన తాజాగా జగపతిబాబుతో కలిసి నటించిన చిత్రం ‘ఆటగాళ్ళు’. ఈ సినిమాపై టీజర్‌ రిలీజ్‌ అయిన దగ్గర నుంచే మంచి హైప్‌ క్రియేట్‌ అయ్యింది. మరి ఆ అంచనాల్ని ఆటగాళ్ళు అందుకున్నారా..?
కథ:
సిద్దార్థ (నారా రోహిత్) టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్. ఎప్పటికైనా మహాభారతాన్ని డైరెక్ట్‌ చేయాలని కలలు గనే సినీ దర్శకుడు. ఆ ప్రాజెక్టు పని మీద అంజలి(దర్శన్ బానిక్) అనే అమ్మాయిని కలిసి సిద్ధార్థ ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. వారి దాంపత్యజీవితం మూడు సంవత్సరాలు హ్యాపీగా సాగిపోయిన తర్వాత అంజలి హత్యకు గురవుతుంది. తన భార్యను చంపిన కేసులో సిద్ధార్థ్ ను రిమాండ్ కు పంపిస్తారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వీరేంద్ర (జగపతిబాబు) సిద్ధార్థ్ ని కేసు నుంచి బయట పడేస్తాడు. ఆ తర్వాతే సిద్దార్ధ గురించి వీరేంద్రకు ఊహించని నిజాలు తెలుస్తాయి. దాంతో ఇద్దరి మధ్య గేమ్ స్టార్ట్ అవుతుంది. అంజలిని చంపిన కేసు లో మున్నా అనే వ్యక్తికి శిక్ష పడుతుంది. నిజంగా మున్నానే అంజలి చంపాడా.? సిద్ధార్థని విడిపించిన వీరేంద్రే తనని ఎందుకు చంపాలనుకున్నాడు.? సిద్ధార్థ, వీరేంద్రల మధ్య యుద్ధంలో ఎవరు గెలిచారు? అన్నదే మిగతా కథ.
 ఓ క్రియేటివ్ సినిమా డైరెక్టర్ గా నటించిన నారా రోహిత్ ఎప్పటిలాగే ఓ వైవిధ్యమైన పాత్రలో కనిపిస్తారు. రొమాంటిక్‌ సన్నివేశాల్లో లవర్‌ బాయ్‌ గా కనిపించిన నారా రోహిత్ తరువాత సీరియస్‌ లుక్‌లోనూ సూపర్బ్ అనిపించాడు.ఓ సిన్సియర్ అండ్ పవర్ ఫుల్ లాయర్ గా నటించిన జగపతిబాబు తన నటనతో ఆకట్టుకుంటారు.చాలా కాలం తరువాత బ్రహ్మానందంకు కామెడీకి మంచి స్కోప్‌ ఉన్న పాత్ర దక్కింది. పోలీస్‌ ఆఫీసర్‌గా సుబ్బరాజు ఆకట్టుకున్నాడు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే చేశారు.

+Points:

నారా రోహిత్, జగపతిబాబు ల నటన
బ్యాగ్రౌండ్ మ్యూజిక్,
సస్పెన్స్ సన్నివేసాలు
-Points:
స్లో కధనం
కొన్ని కొన్ని లవ్ సన్నివేసాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *