‘గీత గోవిందం’ సినిమా రివ్యూ | రేటింగ్ 3.7/5⭐⭐⭐⭐⭐

‘గీత గోవిందం’ సినిమా రివ్యూ

Tittle          : గీత గోవిందం

                          Banner      : రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌

                                                                     Cast  : విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న, సుబ్బరాజు, రాహుల్‌ రామకృష్ణ

Music         : గోపి సుందర్‌

Producer   : బన్నీ వాస్

Director    : పరశురామ్‌

కథ:
విజయ్ గోవింద్ (విజయ్ దేవరకొండ) ఇంజినీరింగ్ కాలేజీలో లెక్చరర్. సంస్కారవంతుడు.. సంప్రదాయాలు, పద్ధతులు, విలువలు తెలిసిన వ్యక్తి. చిన్నప్పటి నుంచి చాగంటి కోటేశ్వరరావుగారి ప్రవచనాలు విని పెరిగిన పద్ధతి గల కుర్రాడు. తను చేసుకోబోయే అమ్మాయి కూడా సాంప్రదాయబద్ధంగా, తన అమ్మలాగే ఉండాలని కలలు కంటుంటాడు.ఓ సంద‌ర్భంలో గుడిలో గీత‌(ర‌ష్మిక మంద‌న్న‌)ను చూసి ప్రేమిస్తాడు. చెల్లెలకు పెళ్లి ఫిక్స్ కావ‌డంతో ఊరికి బ‌య‌లుదేరిన గోవిందంకు గీత బ‌స్సులో ప‌రిచ‌యం అవుతుంది. అనుకోకుండా కొన్ని ప‌రిస్థితుల్లో గీత‌ను గోవిందం ముద్దు పెట్టుకుంటాడు.అయితే అనుకోని సంఘటన జరగడంతో గోవింద్‌పై రష్మికకు దురాభిప్రాయం ఏర్పడుతుంది. అతన్ని అసహ్యించుకుంటుంది.కానీ అతనితోనే కలసి ప్రయాణం చేయాల్సి వస్తుంది. మరి ఈ ప్రయాణంలో ఏం జరిగింది?చివరికి వీళ్లిద్దరూ కలిశారా? అనే ప్రశ్నలకు సినిమానే సమాధానం.
నటీనటులు :
ఫ్యామిలీ చిత్రాల్లో ప్రేమ క‌థ‌ల‌ను తెర‌కెక్కించే స‌మ‌యాల్లో స‌న్నివేశాలు గ్రిప్పింగ్, బోరింగ్‌గా ఉండ‌కూడదు. ద‌ర్శ‌కుడు ప‌రుశురామ్ స‌న్నివేశాల‌ను చ‌క్క‌గా రాసుకున్నాడు.ఆగ‌స్ట్ నెల విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు బాగానే క‌లిసొచ్చింది. అర్జున్‌రెడ్డితో స‌క్సెస్ కొట్టిన ఈ కుర్ర హీరో .. ఈ సినిమాతో స‌క్సెస్ అందుకున్నాడన‌డంలో సందేహం లేదు. అర్జున్‌రెడ్డిలో ర‌ఫ్, యార‌గెంట్‌గా క‌న‌ప‌డ్డ విజ‌య్ … త‌ప్పును తెలియ‌నివ్వ‌కుండా హీరోయిన్‌ని బ్ర‌తిమలాడుకునే స‌న్నివేశాల్లో.. స్టూడెంట్‌కు బుద్ధి చెప్పే గురువుగా.. ప్రేమ కోసం తాపత్ర‌య ప‌డే ప్రేమికుడిగా చ‌క్క‌గా న‌టించాడు.హీరోయిన్‌ గా రష్మిక మరోసారి వావ్‌ అనిపించారు. ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ భామ, గీత పాత్రలో టాలీవుడ్‌కు మరింత చేరువయ్యారు.చాలా రోజుల తరువాత సుబ్బరాజుకు మంచి పాత్ర దక్కింది. ఇతర పాత్రల్లో రాహుల్‌ రామకృష్ణ, నాగబాబు, గిరిబాబు, అన్నపూర్ణ తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.
ప్లస్‌ పాయిoట్స్‌ :
విజయ్‌ దేవరకొండ, రష్మిక నటన Acting
డైలాగ్స్‌, Music, 
మైనస్‌ పాయింట్స్‌ ;
Slow Narration in Second Half
Old Story

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *