‘ఝాన్సీ‌’ మూవీ రివ్యూ | Rating 2.7/5⭐⭐⭐⭐⭐

Cast : జ్యోతిక, జీవి ప్రకాష్
Director : బాలా
Screenply : బాలా
Producer : కోనేరు కల్పన
Music : ఇళయరాజా
Cinematography : తేని ఈశ్వర్
Editer : సతీష్ సూర్య

వైవిధ్యమైన దర్శకుడు బాల దర్శకత్వంలో జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన తమిళ సినిమా ‘నాచియార్’. కాగా ఈ చిత్రం ఈ రోజు ‘ఝాన్సీ’ పేరుతో తెలుగులో రిలీజ్ అయింది. జ్యోతిక ప్రధాన పాత్రలో ఓ లేడీ ఓరియంటెడ్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రఫ్‌ అండ్‌ టఫ్‌ పోలీస్‌ పాత్రలో జ్యోతిక ఏ మేరకు ఆకట్టుకున్నారు..?(బొమ్మ పడింది)
కథ:
ఝాన్సీ (జ్యోతిక) ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్. మైనర్లయిన గాలి రాజు (జీవి ప్రకాష్ కుమార్‌), రాశి (ఇవానా) ప్రేమించుకుంటారు. రాశి గర్భవతి అవుతుంది. దీంతో గాలి రాజు మీద రేప్‌ కేసు నమోదు చేస్తారు. ఆమెను కస్టడీలోకి తీసుకోని ఆ కేసులో భాగంగా రాశి ప్రగ్నన్సీకి కారణమైన గాలి రాజు (జివి ప్రకాష్ )ని అరెస్ట్ చేసి ఇన్వెస్ట్ గేట్ చేయగా అటు రాశి, ఇటు గాలి రాజు ఇద్దరూ మేం ప్రేమించుకున్నామని ప్రగ్నన్సీకి మేం ఇద్దరం కారణమని అంగీకరిస్తారు. కానీ ఝాన్సీకి రాజు ‘డి.ఎన్.ఏ’కి, రాశికి పుట్టిన బిడ్డ ‘డి.ఎన్.ఏ’కు అసలు మ్యాచ్ కావట్లేదు అని తెలుస్తోంది. అసలు రాశి ఎవరి వల్ల గర్భవతి అయ్యింది..? ఈ కేసులో గాలి రాజు ఎలా ఇరుక్కున్నాడు..? కేసును ఝాన్సీ ఎలా సాల్వ్ చేసింది..? అన్నదే మిగతా కథ.
విశ్లేషణ ;
ఇప్పటి వరకు బాలా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాల్లో కాస్త లైటర్‌వేలో తెరకెక్కిన సినిమా ఇదే అని చెప్పొచ్చు.దర్శకుడు బాల ఓ మంచి స్టోరీ ఐడియా తీసుకున్నారు గాని, ఆ ఐడియాకు తగ్గట్టు అంతే కొత్తగా ట్రీట్మెంట్ మాత్రం రాసుకోలేదు. సినిమాలో సప్సెన్స్ ఇంట్రస్ట్ పెంచే స్కోప్ ఉన్నప్పటికీ బాలా మాత్రం సెకెండ్ హాఫ్ ని సింపుల్ గా హ్యాండల్ చేశారు. తెలుగు రిలీజ్‌ కోసం ప్రత్యేకంగా జాగ్రత్తలేవి తీసుకున్నట్టుగా అనిపించదు. తమిళ బోర్డులు, నేమ్‌ ప్లేట్లు తమిళ్‌లోనే కనిపిస్తాయి. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్‌, నిర్మాణవిలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. కానీ సినిమాలో ఇవాన – జివి ప్రకాష్ లవ్ స్టోరీ బి.సి సెంటర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అలాగే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా జ్యోతిక పెర్ఫామెన్స్ కూడా సినిమాకి హైలెట్ గా నిలుస్తోంది. మరి బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఎంతవరికి నిలబడుతుందో చూడాలి.
ప్లస్‌ పాయింట్స్‌ :
Jyothika Acting,
Story line
మైనస్‌ పాయింట్స్‌ ;
Dubbing,
Language
Movie Tamil Nativity

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *