దివంగత మహానేత “వైఎస్‌ రాజశేఖరరెడ్డి “జీవితకథ” -“యాత్ర” రిలీజ్ తేది ఖరారు

దివంగత మహానేత “వైఎస్‌ రాజశేఖరరెడ్డి” జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న యాత్ర చిత్రం విడుదల తేదీని ఖరారు చేశారు.(బొమ్మపడింది) మమ్ముట్టీ లీడ్‌ రోల్‌ పోషిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్‌ 21వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ చిత్రాన్ని ఆనందోబ్రహ్మ ఫేమ్‌ మహి వీ రాఘవ తెరకెక్కిస్తున్నారు. 70 mm ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఇతర ముఖ్య పాత్రలో జగపతిబాబు, సుహాసిని, రావు రమేశ్‌ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: సత్యన్‌ సూర్యన్‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *