Devadas Movie Review | “దేవదాస్”లు అదరగొట్టారు… 3/5⭐⭐⭐⭐⭐

Devadas Movie Review

Devadas Movie  Cast : నాగార్జున అక్కినేని, నాని, ర‌ష్మిక, ఆకాంక్ష సింగ్, న‌రేష్ వికే, బాహుబ‌లి ప్ర‌భాక‌ర్, రావు ర‌మేష్,
వెన్నెల కిషోర్, అవ‌స‌రాల శ్రీ‌నివాస్, స‌త్య తదితరులు..
Banner : వైజయంతి మూవీస్ మ‌రియు వ‌యాక‌మ్ 18 మీడియా ప్రైవేట్ లిమిటెడ్
Cinimatography: శ్యామ్ ద‌త్
Music: మ‌ణిశ‌ర్మ
Producer : అశ్వనీద‌త్
Director : శ్రీ‌రామ్ ఆదిత్య‌
అక్కినేని నాగార్జున.. నానిల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన మల్టీస్టారర్ మూవీ ‘దేవదాస్’. Devadas Movie Review  వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌లో అశ్వనీదత్‌ స్వయంగా నిర్మాతగా తెరకెక్కించిన ఈ సినిమాకు శ్రీరామ్‌ ఆదిత్య దర్శకుడు. ‘భలే మంచి రోజు’.. ‘శమంతకమణి’ చిత్రాలతో తన ప్రతిభ చాటుకున్న యువ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య. మల్టీస్టారర్‌గా తెరకెక్కిన దేవదాస్‌ సక్సెస్‌ అయ్యిందా..? నాగ్‌,నానిల కాంబినేషన్ ఏ మేరకు అలరించింది..? చూద్దాం పదండి.‘దేవదాస్‌’ మూవీ రివ్యూ
devdas movie review
కథ:
దాస్ ఓ డాక్టర్. కార్పొరేట్ హాస్పిటల్ లో పనిచేయలేక ఓ చిన్న క్లినిక్ నడిపిస్తుంటాడు. దేవ ఓ మాఫియా డాన్. తనను ఆదరించి పెంచిన దాదా(శరత్‌ కుమార్‌)ను ప్రత్యర్థులు చంపేయటంతో పదేళ్లపాటు అజ్ఞాతంలో ఉన్న దేవ బయటకు వస్తాడు. దేవా వాళ్లపై ప్రతీకారం తీర్చుకోవడానికి హైదరాబాద్ వస్తాడు. ఓ పోలీస్‌ అటాక్‌లో గాయపడిన దేవకు డాక్టర్‌ దాస్‌ (నాని) ట్రీట్‌మెంట్‌ చేస్తాడు. తాను క్రిమినల్‌ అని తెలిసినా పోలీస్‌లకు పట్టివ్వని దాస్‌ మంచితనం చూసి, దేవ అతనితో ఫ్రెండ్‌షిప్ చేస్తాడు. మరోవైపు పోలీసులు దేవా కోసం వెదికే క్రమంలో దాస్ పై ఓ కన్నేసి ఉంచుతారు. ఈ క్రమంలో వలపన్ని దేవాను అరెస్ట్ చేసే సమయానికి, దాస్ సమక్షంలోనే ఓ క్రిమినల్ ను దేవా చంపేస్తాడు. ఆ చావు చూసి చలించిపోయిన దాస్, దేవాతో ఫ్రెండ్ షిప్ కట్ చేసుకుంటాడు. దాసుతో అతడి స్నేహం ఎలాంటి మలుపులు తిరిగింది అన్నది మిగతా కథ.
నటీనటులు – విశ్లేషణ:
‘దేవదాస్’ సినిమాకు సంబంధించి అతి పెద్ద ఆకర్షణ నాగార్జున-నానిల కాంబినేషనే. దేవ పాత్రలో నాగ్, దాస్ గా నాని అదరగొట్టారు. వీళ్లిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అదిరిపోయింది. ముఖ్యంగా నాగ్‌, నానిల మధ్య వచ్చే సన్నివేశాల్లో వారిద్దరి కెమిస్ట్రీ సినిమాను మరింత ఎంటర్‌టైనింగ్‌గా మార్చింది. ఎమోషనల్‌ సీన్స్‌లోనూ ఇద్దరి నటన సూపర్బ్‌. సినిమా అంతా దేవ, దాస్‌ల చుట్టూనే తిరుగడంతో హీరోయిన్ల పాత్రలకు పెద్దగా ఇంపార్టెన్స్‌ లేదు. ఉన్నంతలో ఆకాంక్ష సింగ్, రష్మికలు ఆకట్టుకున్నారు. ఇతర నటీనటుల్లో సీనియర్ నరేష్, బాహుబలి ప్రభాకర్, రావు రమేష్, వెన్నెల కిషోర్, అవసరాల శ్రీనివాస్ లాంటి నటులు ఆకట్టుకున్నారు.
దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య తను అనుకున్న కథకు తెర రూపం ఇవ్వటంలో విజయం సాధించాడు. ఫస్ట్‌ హాఫ్ దేవ, దాస్‌ల మధ్య ఫ్రెండ్‌షిప్‌, కామెడీ ఆకట్టుకున్నా.. ప్రేమకథలు ఆసక్తికరంగా లేకపోవటం నిరాశకలిగిస్తుంది. సినిమాకు సంగీతమందించిన మణిశర్మ తన మార్క్‌ చూపించాడు. పాటలు మాత్రం రెండే బాగున్నాయి. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. నిర్మాణవిలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. Devadas Movie Review
+Points
కింగ్ నాగార్జున, నాని ల నటన బాగుంది
కామెడి టైమింగ్ అదిరిపోయింది.
స్క్రిన్ ప్రెజెంటేషన్ బాగుంది
-Points
ఫస్ట్ హాఫ్ స్లోగా ఉంది
సంగీతం

For More Telugu MOvie Reviews www.bommapadindi.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *