నందమూరి హరికృష్ణ…ఇక లేరు!!!

Share Us

 

నందమూరి హరికృష్ణ…ఇక లేరు!!!

నందమూరి హరికృష్ణ ప్రముఖ తెలుగు సినిమా నటుడు మరియు రాజకీయ నాయకుడు. (బొమ్మపడింది)ఇతడు నందమూరి తారక రామారావు పెద్ద కుమారుడు. తెలుగుదేశం పార్టీ తరపున రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించాడు. ఇతని కుమారులు కళ్యాణ్ రామ్ మరియు జూనియర్ ఎన్.టి.ఆర్ ఇద్దరూ తెలుగు నటులే. హరికృష్ణ ఆగస్టు 29 2018న రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. నెల్లూరు జిల్లా కావలిలో జరిగే ఒక వివాహానికి హాజరయ్యేందుకు హరికృష్ణ స్వయంగా కారును డ్రైవ్‌ చేస్తూ తెల్లవారుజామున నాలుగు గంటలకు బయలు చేరారు. అన్నేపర్తి వద్ద డివైడర్‌ను , ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టారు. దీంతో హరికృష్ణ ఎగిరిపడ్డారు. పక్కనే ఉన్న బండరాళ్లపై ఆయన పడడంతో తలకు, వెన్నుముకకు తీవ్ర గాయమైంది. సీటు బెల్ట్ పెట్టుకోకపోవడంతో ప్రమాద తీవ్రత అధికమైనట్టు భావిస్తున్నారు. హరికృష్ణకు చెందిన ఏపీ కారు కూడా అతివేగంగా ప్రయాణించినట్టు ప్రమాద తీవ్రతను బట్టి అంచనా వేస్తున్నారు.
రాష్ట్ర విభజన నిర్ణయానికి నిరసనగా హరికృష్ణ రాజీనామా చేశాడు. తన రాజ్యసభ సభ్యత్వానికి 22/08/2013 రాజీనామా సమర్పించారు. సమైక్య రాష్ట్రం కోసం త్వరలో రాష్ట్ర పర్యటన చేయబోతున్నాడు. రాజ్యసభ ఛైర్మన్ కు స్వయంగా తన రాజీనామా లేఖను అందించారు. హరికృష్ణ సమైక్యవాదాన్ని బలంగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తన రాజీనామా లేఖతో హరికృష్ణ మరో ముందడుకు వేశాడు. హరికృష్ణ త్వరలోనే తన రాజకీయ భవిష్యత్తు గురించి స్పష్టత ఇచ్చే అవకాశముంది.

Share Us

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

shares