@నర్తనశాల : మూవీ రివ్యూ | అనుకున్నంత స్థాయి లో లేదు!!!2.5/5⭐⭐⭐⭐⭐

@నర్తనశాల : మూవీ రివ్యూ

Cast : నాగశౌర్య-కశ్మీరా పరదేశి-యామిని భాస్కర్-అజయ్-శివాజీ రాజా-జయప్రకాష్ రెడ్డి-సత్యం రాజేష్ తదితరులు
Music : మహత్ స్వర సాగర్
Producer : ఉష మూల్పూరి

Editor  : కోటగిరి వెంకటేశ్వరరావు

Director : శ్రీనివాస్ చక్రవర్తి

హీరోగా పడుతూ లేస్తూ సాగిన నాగశౌర్య ఈ ఏడాది ఆరంభంలో ‘ఛలో’తో మంచి విజయాన్నందుకున్నాడు.(బొమ్మపడింది) తరువాత అమ్మమ్మగారిళ్లు, కణం లాంటి సినిమాలతో కాస్త తడబడ్డాడు. అయితే ఆ సినిమాల ప్రభావం నాగశౌర్య కెరీర్‌ మీద పెద్దగా కనిపించలేదు. సొంత బేనర్లో శ్రీనివాస్ చక్రవర్తి అనే మరో కొత్త దర్శకుడి పరిచయం చేస్తూ ‘@నర్తనశాల’ సినిమా చేశాడు శౌర్య. ఈ చిత్రం ప్రధానంగా లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్ తో రూపొందింది.మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!!
నూతన దర్శకుడు శ్రీనివాస్ చక్రవర్తి దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా యామిని భాస్కర్, కశ్మీర పరదేశి హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘@నర్తనశాల’. ఐరా క్రియేషన్స్ పతాకం ఫై నాగశౌర్య తల్లి ఉషా మూల్పూరి నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రధానంగా లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్ తో రూపొందింది. కాగా ఈ చిత్రం ఈ రోజు ఆగష్టు 30న విడుదల అయింది. మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!
కథ : కళ్యాణ్ (శివాజీరాజా) తనకు ఆడబిడ్డ పుట్టాలని బలంగా కోరుకుంటాడు. కానీ అతడి భార్య మగబిడ్డను ప్రసవిస్తుంది. శివాజీరాజా (కళామందిర్ కళ్యాణ్ ) తన తండ్రి ప్రాణాల కోసం, కొడుకును కూతురిలా మార్చి పెంచుతూ ఉంటాడు. ఓ బుడబుక్కల వాడితో సరదాగా మా అమ్మాయికి ఎలాంటి మొగుడు వస్తాడో చెప్పాలని అడిగిన కల్యాణ్‌కు అనుకొని సమాధానం ఎదురవుతుంది. ఆడవాళ్ళ కోసం సెల్ఫ్ – డిఫెన్స్ ట్రైనింగ్ సెంటర్ ని కూడా స్టార్ట్ చేస్తూ.. తమను తాము సేవ్ చేసుకున్నే విధంగా అమ్మాయిలకి ట్రైనింగ్ చేస్తూ ఉంటాడు. ఇలాంటి సమయంలో ఇద్దరు అమ్మాయిలు శౌర్యతో ప్రేమలో పడతారు. అందులో ఓ అమ్మాయి నుంచి తప్పించుకునే క్రమంలో తాను స్వలింగ సంపర్కుడినని చెబుతాడు శౌర్య. దీంతో అతడికి కష్టాలు మొదలవుతాయి. ఆ క్రమంలో తను ఎదురుకున్న సమస్యలు ఏమిటి ? తనూ ప్రేమించిన మానసకి, జేపీ కుటుంబానికి ఉన్న సంబంధం ఏమిటి ? అసలు శౌర్య తను ప్రేమించిన మానసను పెళ్లి చేసుకుంటాడా ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాలసిందే.
నటీనటులు :
ఛలో సినిమాతో సూపర్‌ హిట్‌ సాధించిన నాగశౌర్య అదే కాన్ఫిడెన్స్‌ తో మరోసారి తన సొంత నిర్మాణ సంస్థలో @నర్తనశాల సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గే లక్షణాలు ఉన్న పాత్రలో నటించిన శౌర్య ఆ పాత్ర తాలూకు ఎక్స్ ప్రెషన్స్ గాని, మాడ్యులేషన్ గాని చాలా చక్కగా పలికించాడు. ఇక కథానాయకిగా నటించిన కశ్మీరా పరదేశి తన స్క్రీన్ ప్రెజెన్స్ తో గ్లామర్ తో బాగానే ఆకట్టుకుంది. ఆమె ఇంట్రడక్షన్ సన్నివేశాలు కూడా అలారిస్తాయి.హీరో తండ్రి పాత్రలో నటించిన శివాజీ రాజా తన కెరీర్ లోనే మరో గుర్తు పెట్టుకున్నే పాత్ర చేశారు. ఆయన తన నటనతో కామెడీ బాగానే పండించారు. దర్శకుడు శ్రీనివాస్ చక్రవర్తి కామెడీని పండించే ప్రయత్నం చేసినా, అయన పూర్తిగా ఆకట్టుకోలేకపోయారు
సాంకేతిక విభాగం :
విజయ్ సి కుమార్ సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలో దృశ్యాలన్నీ ఆయన చాలా అందంగా చూపించారు.డైరెక్టర్ శ్రీనివాస్ చక్రవర్తి భిన్నమైన పాయింటే ఎంచుకున్నాడు కానీ.. దాన్ని ఆసక్తికరమైన సినిమాగా మలచడంలో విఫలమయ్యాడు. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది .
ప్లస్‌ పాయింట్స్‌:
Hero Acting
Songs
మైనస్‌ పాయింట్స్‌:
Story line
Slow narration
comedy less

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *