‘నీవెవరో’ మూవీ రివ్యూ 2.5/5⭐⭐⭐⭐⭐ | ఇంతకి ఎలా ఉందంటే…

Tittle : నీవెవరో
Jonar : యాక్షన్ థ్రిల్లర్‌
Cast : ఆది పినిశెట్టి, తాప్సీ పన్ను, రితీకా సింగ్‌, వెన్నెల కిశోర్‌
Music : అచ్చు రాజమణి, ప్రసన్‌
Director : హరినాథ్‌
Producer : ఎంవీవీ సత్యానారాయణ, కోన వెంకట్‌

సరైనోడు, రంగస్థలం సినిమాలతో టాలీవుడ్‌లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆది పినిశెట్టి హీరోగా తెరకెక్కిన యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ నీవెవరో. ఆది పినిశెట్టి హీరోగా, తాప్సీ పన్ను, రితికా సింగ్‌ ముఖ్య పాత్రల్లో వచ్చిన థ్రిల్లర్‌ చిత్రం ‘నీవెవరో’. రంగస్థలం తర్వాత ఆది నటిస్తోన్న చిత్రం కావటంతో ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ప్రేక్షకుల్ని ఏ స్థాయిలో ఆకట్టుకుందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం..
కథ :
పదిహేనేళ్ల వయసులో కళ్లు పొగొట్టుకున్న కల్యాణ్‌ (ఆది పినిశెట్టి) తన వైకల‍్యాన్ని జయించి ఓ పాపులర్‌ రెస్టారెంట్‌కు ఓనర్ అవుతాడు‌. రెస్టారెంట్‌ని న‌డుపుతూ బాగా డ‌బ్బు సంపాదిస్తుంటాడు. తనకు రెస్టారెంట్‌ లో కలిసి వెన్నెల (తాప్సీ) అనే అమ్మాయి నచ్చి ఆ అమ్మాయితో ప్రేమలో పడతాడు కల్యాణ్. ఇంత‌లో ఇంట్లోవాళ్లు చిన్న‌ప్ప‌ట్నుంచీ స్నేహితురాలైన అను (రితికా)తో క‌ల్యాణ్‌కి పెళ్లి చేయాల‌నుకుంటారు. తన ప్రేమ విషయం వెన్నెలకు చెప్పాలనుకున్న సమయంలో ఆమె ఓ ప్రాబ్లమ్‌లో ఉన్నట్టుగా తెలుస్తుంది.కళ్యాణ్ వెన్నెల సమస్య తీర్చే ప్రాసెస్ లో యాక్సిడెంట్ అయి మూడు వారాలు పాటు స్పృహ కొల్పాతాడు. కానీ ఆ యాక్సిడెంట్ తర్వాత కళ్యాణ్ కి కళ్ళు వస్తాయి. కానీ వెన్నెల మిస్ అవుతుంది. చివరకు కుటుంబ సభ్యుల ఒత్తిడి చేయటంతో తన బెస్ట్ ఫ్రెండ్‌ అను (రితికా సింగ్‌)ను పెళ్లిచేసుకునేందుకు ఒప్పుకుంటాడు‌. అనుతో ఎంగేజ్‌మెంట్‌కు సిద్ధమైన కల్యాణ్‌కు వెన్నెలను కొంత మంది కిడ్నాప్ చేశారని తెలుస్తుంది. ఆమె కాపాడేందుకు వెళ్లిన కల్యాణ్‌కు ఎదురైన పరిస్థితులేంటి..? అసలు వెన్నెల ఏమైంది..? కల్యాణ్‌, వెన్నెలను కలుసుకున్నాడా. లేదా.? అన్నదే మిగతా కథ.
విశ్లేష‌ణ‌:
సరైనోడు, నిన్నుకోరి, రంగస్థలం సినిమాల్లో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న ఆది పినిశెట్టి సోలో హీరోగా మరింత బాధ్యతగా నటించాడు. కళ్యాణ్ అనే బ్లైండ్ క్యారెక్టర్ లో నటించిన ఆది పినిశెట్టి అచ్చం ఓ బ్లైండ్ లాగే నటించి మెప్పించాడు. లుక్స్ పరంగా పెర్ఫామెన్స్ పరంగా ఆది నటనలో తన మార్క్ చూపిస్తాడు. వెన్నెల (తాప్సి)తో ప్రేమలో పడే సన్నివేశాల్లో మరియు ప్రేమించిన అంమ్మాయి కోసం వెతికే కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో ఆయన నటన ఆకట్టుకుంటుంది. నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో తాప్సీ నటన సినిమాకు ప్లస్‌ అయ్యింది. సెకండ్‌హాఫ్‌లో వెన్నెల కిషోర్ కామెడీ పండించాడు. కానీ సీరియ‌స్‌గా సాగే ఈ త‌ర‌హా సినిమాల‌కి అలాంటి కామెడీ ఎందుకో అర్థం కాదు. స‌ప్త‌గిరి పాత్ర‌, ఆయ‌న కామెడీ కూడా అక్క‌డ‌క్క‌డా న‌వ్విస్తుంది. రితికాసింగ్ అందంతో ఆక‌ట్టుకుంటుంది.
నిర్మాణ విలువ‌లు బాగున్నాయి. కెమెరా ప‌నిత‌నం, సంగీతం ఫ‌ర్వాలేద‌నిపిస్తాయి. ఎడిటింగ్‌పై ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది.
+Points:
ఆది పినిశెట్టి నటన
తాప్సీ నటన
కథ ఆక‌ట్టుకుంటుంది
-Points :
No Comedy
Second half
Slow Naration

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *