“పేపర్ బాయ్” రివ్యూ – పేపర్ బాయ్ ఫెయిల్ అయ్యాడా???2.3/5⭐⭐⭐⭐⭐

‘పేపర్‌ బాయ్‌’ మూవీ రివ్యూ

Tittle : పేపర్‌ బాయ్‌
Cast : సంతోష్‌ శోభన్‌, రియా సుమన్‌ , తాన్య హోపే
Music : భీమ్స్‌ సిసిరొలియో
Producer : సంపత్‌ నంది, రాములు, వెంకట్‌, నరసింహా
Writer : సంపత్‌ నంది
Director : జయశంకర్‌

మాస్ చిత్రాల దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న సంపత్‌ నంది. దర్శకుడిగా కొనసాగుతూనే రచయితగా.. నిర్మాతగానూ అభిరుచిని చాటుకునే ప్రయత్నంలో ఉన్నాడు.(బొమ్మపడింది) తను నేను ఫేం సంతోష్‌ శోభన్‌ హీరోగా సంపత్‌ నంది నిర్మాణంలో జయశంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ పేపర్‌ బాయ్‌. సంతోష్ శోభన్, రియా, తాన్య హోప్ హీరో హీరోయిన్లు గా నటించిన ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది.
కథ :
రవి (సంతోష్ శోభన్) బి.టెక్ చేస్తూనే ఆర్ధిక ఇబ్బందులు కారణంగా పేపర్ బాయ్ గా వర్క్ చేస్తుంటాడు. . తాను పేపర్ వేసే ఒక పెద్ద కుటుంబానికి చెందిన ధరణి (రియా సుమన్)ని అతను ఇష్టపడతాడు. రవి వ్యక్తిత్వం నచ్చి ఆమె కూడా అతడిని ప్రేమిస్తుంది. నాలుగేళ్లుగా ఆమెను ప్రేమిస్తుంటాడు. కూతురి ప్రేమకు గౌరవమిచ్చిన ధరణి తల్లిదండ్రులు తమ అంతస్తును పక్కన పెట్టి ఆటో డ్రైవర్‌ కొడుకు, పేపర్‌ బాయ్‌ అయిన రవితో పెళ్లికి ఓకె చెప్తారు. దాంతో రవి, ధరణి నిశ్చితార్ధం కూడా జరుగుతుంది. ఆ తర్వాత రవికి ధరణిని వదిలేసి వెళ్లిపోవాల్సిన పరిస్థితి వస్తోంది. ఐతే ఇరువురి నేపథ్యాల్లో అంతరం వీరి ప్రేమకు అడ్డంకిగా మారుతుంది. దీంతో ధరణికి దూరమవ్వాలని రవి అనుకుంటాడు. వారి విడిపోవడానికి కారణాలేంటి..? వీరి ప్రేమకథకు ముంబైలో ఉండే మేఘ (తాన్యా హోపే)కు సంబంధం ఏంటి… లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాలసిందే.
నటీనటులు – విశ్లేషణ :
తన కెరీర్ లో హీరోగా రెండో సినిమా చేస్తోన్న సంతోష్‌ శోభన్‌ ఆ పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. లవర్‌ బాయ్‌గా కనిపిస్తూనే ఎమోషనల్‌ సీన్స్‌లో కంటతడి పెట్టించాడు. ముఖ్యంగా హీరోయిన్ తో తనకి మధ్య సాగే సన్నివేశాల్లో గాని, క్లైమాక్స్ గాని ఎంతో అనుభవం ఉన్న నటుడిలా బాగా నటించాడు.తాన్య హోపే తెర మీద తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. మహేష్ విట్టా, హీరోయిన్ ఫ్రెండ్ గా చేసిన విద్ద్యుల్లేఖ, ఆమె లవర్ గా నటించిన బిత్తరి సత్తి ఉన్నంతలో బాగానే నవ్వించారు..
సంపత్‌ నంది రచన సినిమాకు హెల్ప్‌ అయ్యింది. స్క్రిప్ట్ లో కొన్ని లోపాలు ఉండటం కారణంగా.. దర్శకుడు ఈ చిత్రాన్ని ఆసక్తికరంగా మలచలేకపోయారు. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే లవ్ సాంగ్ బాగా ఆకట్టుకుంటుంది. సౌందర్య రాజన్ సినిమాటోగ్రఫీ హైలెట్. నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.
+Points:
నటీ నటులు
సంగీతం
డైలాగ్స్
-Points:
అనుకున్నంత కామెడి లేదు
స్లో – స్టోరి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *