silly fellows movie review ||‘సిల్లీ ఫెలోస్‌‌’ పాత కామెడితో బోర్ కొట్టింది

silly fellows movie review | Rating 2/5⭐⭐⭐⭐⭐

Cast : సునీల్, అల్లరి నరేష్, పూర్ణ , చిత్రశుక్ల, జయ ప్రకాష్ రెడ్డి, పోసాని, బ్రహ్మానందం తదితరులు.
Music: శ్రీ వసంత్
Editor : గౌతమ్ రాజు
Cinimatography : అనీష్ తరుణ్ కుమార్
Producers: కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి
Screenply: భీమనేని శ్రీనివాసరావు
Director : భీమనేని శ్రీనివాసరావు
వరుస ఫ్లాప్‌లతో అల్లరి నరేష- సునీల్ ఇటీవల కాలంలో బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తాపడుతున్నాయి. silly fellows movie review  అలాంటి పరిస్థితుల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు సునీల్, అల్లరి నరేష్‌ జతకట్టారు. బీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో అల్లరి నరేష్ మరియు సునీల్ కలిసి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సిల్లీ ఫెలోస్’. (బొమ్మ పడింది) తమిళంలో విజయవంతమైన ఓ చిత్రం ఆధారంగా ఈ సినిమాను రూపొందించాడు. అల్లరి నరేష్‌, సునీల్ ల కెరీర్‌కు ఎంతో కీలకమైన సిల్లీ ఫెలోస్‌ ప్రేక్షకులను ఆకట్టుకుందా..? ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం…
కథ:
వీరబాబు (అల్లరి నరేష్‌), సూరి బాబు (సునీల్‌) సత్యనారాయణపురం ఎమ్మెల్యే జాకెట్ జానకీ రాం(జయప్రకాష్ రెడ్డి) అనుచరులు. వీరబాబు (అల్లరి నరేష్) ఒక టైలరింగ్ షాపు నడుపుతుంటాడు. కాగా ఎమ్మెల్యేకి చెడ్డపేరు తెచ్చి, అతనికి రాబోయే మంత్రి పదవిని తాను దక్కించుకోవాలని చూస్తుంటాడు మరో ఎమ్మెల్యే (రాజా రవింద్ర). వీరబాబు (అల్లరి నరేష్) బలవంతం చేసి ఒప్పించడంతో పుష్ప (నందిని) అనే రికార్డింగ్ డ్యాన్సర్‌ను సురిబాబు (సునీల్) పెళ్లి చేసుకొంటాడు. కానీ అప్పటికే కృష్ణవేణి తో ప్రేమలో ఉండటంతో వెంటనే విడాకులు తీసుకోవాలని అనుకొంటాడు. దాంతో సూరిబాబు ప్రేమించి పెళ్లిచేసుకోబోయే అమ్మాయి (పూర్ణ) అతన్ని ఛీ కొడుతుంది. పుష్పతో ఎటువంటి సంబంధం లేదని ప్రూవ్ చేస్తేనే మనం ఒకటవుతాం అని కండీషన్ పెడుతుంది. అతడిని సమస్యల నుంచి బయట పడేయాల్సిన ఎమ్మెల్యే మతిస్థిమితం కోల్పోతాడు. దీంతో వీరబాబు.. సూరి దిక్కు తోచని స్థితిలో పడతారు. తమ సమస్యల నుంచి వీరబాబు, సూరి బాబలు ఎలా బయటపడ్డారు..? అన్నదే మిగతా కథ.
నటీనటులు :
అల్లరి నరేష్ గత తన సినిమాల్లో కంటే ఈ సినిమాలో ఫ్రెష్ గా కనిపించాడు. అయితే పెద్దగా కొత్తదనం చూపించకుండా రొటీన్‌ ఫార్ములానే ఫాలో అయ్యాడు. వీరబాబు క్యారెక్టర్ తో మంచి కామెడీని పండించాడు.
చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన సునీల్ సూరిబాబు పాత్రలో ఒదిగిపోయాడు. కామెడీ వేషాలు మానేసి చాలా ఏళ్ల పాటు హీరోగా కంటిన్యూ అయిపోవడంతో.. సునీల్ కామెడీ టైమింగ్ పూర్తిగా మిస్సయిపోయిన భావన కలుగుతుంది. మరో కీలక పాత్రలో కనిపించిన బిగ్‌బాస్‌ ఫేం నందిని రాయ్‌ నిరాశపరిచారు. సినిమా నిండా బోలెడన్ని కామెడీ క్యారెక్టర్లున్నా వినోదం పండలేదు.
విశ్లేషణ – సాంకేతికవర్గం:
తమిళంలో విజయం సాధించిన ‘వెలైను వంధుట్ట వెల్లకారన్‌’ సినిమాను తెలుగు నేటివిటికి తగ్గట్టుగా కొద్దిపాటి మార్పులతో రీమేక్‌ చేశారు.దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు మంచి కామెడీ ఎంటర్ టైనర్ ను తెరకెక్కించే ప్రయత్నం చేసినప్పటికీ, అది అంతగా పండలేదు. శ్రీ వసంత్ సంగీతం బాగుంది. ఫ్లో లేని క్యారెక్టరైజేషన్స్ తో సినిమాని నడిపించేసాడు. సినిమాటోగ్రపి, ఎడిటర్ గౌతమ్ రాజు ఎడిటింగ్ పనితనం ఈ సినిమాకి ప్లస్ అయింది. , నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
+Points :
నరేష్, సునీల్ నటన
Comedy
-Points:
పెద్దగా కథ లేకపోవటం
సెకండ్‌ హాఫ్

For More Reviews www.bommapadindi.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *