Aravindha Sametha collections – నాన్ బాహుబలి రికార్డులను నరికేస్తున్న వీర రాఘవ రెడ్డి

Share Us

Aravindha Sametha collections

త్రివిక్ర‌మ్-తార‌క్ కాంబినేష‌న్‌లో భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌ల అయిన అరవింద సమేత భారి కలెక్షన్లతో దూసుకుపోతుంది. ప్ర‌పంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వ‌ద్ద భీభత్సం సృష్టిస్తూ తొలిరోజు నాన్ బాహుబ‌లి రికార్డుల‌ను త‌న పేరిట లిఖించుకున్నాడు ఎన్.టి.ఆర్ . ఈ సందర్భంగా తారక్ ఫ్యాన్స్ లో ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డుల గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. కేవలం తెలుగు రాష్ట్రాల గురించే కాదు – ఓవర్సీస్ రిపోర్టులపైనా తారక్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఈ చిత్రం ఏరియా కలెక్షన్స్
నైజాం – 5.73 కోట్లు
సీడెడ్ – 5.48 కోట్లు
నెల్లూరు – 1.06 కోట్లు
గుంటూరు – 4.14 కోట్లు
కృష్ణ – 1.97 కోట్లు
పశ్చిమ గోదావరి – 2.77 కోట్లు
తూర్పు గోదావరి – 2.37 కోట్లు
వైజాగ్ – 8.44 కోట్లు
మొత్తం 26.64 కోట్లు తో బాక్సాఫీస్ సునామీ సృష్టిస్తుంది. 550 లొకేషన్లలో రిలీజైన అజ్ఞాతవాసి కేవలం 1.5 మిలియన్ డాలర్లు మాత్రమే తెస్తే – కేవలం 192 లొకేషన్లలో రిలీజైన `అరవింద సమేత- వీర రాఘవ` 657కె డాలర్లు వసూలు చేసింది. తొలిరోజు దాదాపు $1 మిలియ‌న్ మార్కును అందుకున్న ఈ చిత్రం.. ఈ వీకెండ్ ఆదివారం నాటికి $2 మిలియ‌న్ మార్కును చేరుకోవ‌డం ఖాయ‌మ‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

Share Us

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

shares