Aravindha Sametha reveiw | అరవింద సమేత రివ్యూ

Aravindha Sametha reveiw 3.5/5

Aravindha Sametha reveiw Tittle : అరవింద సమేత
Cast : జూ.ఎన్.టి.ఆర్, పూజా హెగ్దె, ఇషారెబ్బా, జగపతిబాబు, సునిల్, నవీన్ చంద్ర, తదితరులు…
Music : ఎస్.ఎస్.థమన్
Editing : నవీన నూలీ
Cinimatography: పి.ఎస్.వినోద్
Produce : ఎస్.రాధాకృష్ణ
Writer – Directer : త్రివిక్రం
 ఒక పెద్ద డిజాస్టర్ తర్వత కూడా, ఒక పెద్ద హీరో ఆ డైరక్టర్ ని నమ్మి ఒక సినిమాకి ఛాన్స్ ఇస్తే, అందులోను ఆ డైరక్టర్ మాటల మాంత్రికుడు అయితె, ఆ హీరో ఎన్.టి.ఆర్ లాంటి టాప్ హీరో అయితే, ఆ సినిమాపై హోప్స్ ఎల ఉంటాయో చేప్పాల్సిన అవసరం లేదు.  త్రివిక్రం డైరక్షన్లో ఎన్.టి.ఆర్ నటించిన చిత్రం అరవింద సమేత. ఈ సినిమా టీజర్, ట్రైలర్లు రిలీజ్ అయిన తర్వాత ఈ చిత్రంపై వచ్చిన హోప్స్ అంతా ఇంతా కాదు. అందులోను వీళ్ళిద్దరి కాంభినేషన్లో వస్తున్న మొదటి చిత్రం ఇది. మరి అలాంటి సినిమా ఎంత వరకు ప్రేక్షకులను మెప్పించిందో చూద్దాం??
కథ :
నల్లగుడి, కొమ్మది అనే రెండు గ్రామాల మధ్య 5 రూపాయల కోసం జరిగిన చిన్న గొడవ, ఫ్యాక్షనిజం గా రూపుదిద్దుకుంటుంది. నల్లగుడి ఊరి పెద్ద బసి రెడ్డి(జగపతి బాబు) ఆ గొడవకి కారణం కాగా,కొమ్మద్ది ఊరి పెద్ద నారప రెడ్డి (నాగబాబు) ఆ గొడవకి ఆజ్యం పోస్తాడు. 12 ఏళ‍్ల పాటు లండన్‌లో ఉన్న నారపరెడ్డి కుమారుడు వీర రాఘవ రెడ్డి(ఎన్టీఆర్‌) ఊరికి తిరిగి వస్తుండగా , బసి రెడ్డి(జగపతి బాబు) మనుషుల చేతిలో, నారపరెడ్డి హత్యకు గురి అవుతాడు. దాంతో వీర రాఘవ రెడ్డి(ఎన్టీఆర్‌), బసి రెడ్డి(జగపతి బాబు) మనుషులని నరికి చంపేస్తాడు. తన తండ్రి మరణం తరువాత వీర రాఘవ రెడ్డి , తన బామ్మ మాటల వల్ల , ఊరిని వదిలి వెళ్ళిపోతాడు. తర్వత పూజ హెగ్దే(అరవింద)తో ప్రేమలో పడతాడు. తన బామ్మ చెప్పిన మాటలకి, అరవిందకి సంబంధం ఏంటి. అసలు ఫ్యాక్షన్ గొడవలు ఏమయ్యయి. వీర రాఘవ రెడ్డి తన ఊరికి తిరిగి వచ్చాడా? ఆ రెండు ఊర్లని కలిపడా అనే కథ మాత్రం సినిమాలో చూడాల్సిందే.
నటీనటులు – విశ్లేషణ :
Hero:
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా సిక్స్ ప్యాక్ తో పాటు చాలా స్టైలిష్ గా ఫ్రెష్ గా కనిపించాడు. ఎన్టీఆర్‌ అంతా తానే అయ్యి సినిమాను నడిపించాడు. ముఖ్యంగా రాయలసీమ యాసలో తారక్ చెప్పిన డైలాగ్స్, తన మాడ్యులేషన్ స్టైల్, ఎమోషనల్ సన్నివేశాల్లో ఆయన పలికించిన ఎక్స్ ప్రెషన్స్ సినిమాకే హైలెట్. ఈ కథను మరో స్థాయికి తీసుకెళ్లడానికి ఎన్టీఆర్ రూపంలో అతడికి గొప్ప ‘నటుడు’ కూడా దొరికాడు.
Heroine:
‘అరవింద’ పాత్రలో నటించిన పూజా హెగ్డే సినిమాలో కీలక పాత్ర. భావోద్వేగ సన్నివేశాల్లో ఆమె పలికించిన హావభావాలు బాగున్నాయి. మరో హీరోయిన్ ఈషా రెబ్బా కూడా చాలా చక్కగా నటించింది.
Other Actros:
లన్‌ పాత్రలో జగపతి బాబు అత్యంత క్రూరమైన ఫ్యాక్షనిస్ట్ గా తన పాత్రకి పూర్తి న్యాయం చేశారు. నవీన్ చంద్ర కూడా తన నటనతో ఆకట్టుకుంటాడు. రావు రమేష్, సితార, రవి ప్రకాష్, శతృ ఎప్పటిలాగే తమ నటనతో ఆకట్టుకుంటారు. తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
Music:
సంగీత దర్శకుడు యస్ తమన్ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సూపర్బ్‌. కొన్ని సన్నివేశాలలో సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళింది మాత్రం థమన్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్.
Cinimatography:
ఈ సినిమాకి ఎన్.టి.ఆర్ హైలెట్ అయ్యాడంటే దానికి కారణం సినిమాటోగ్రఫి. కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో హీరోయిజాన్ని చూపించింది మాత్రం పి.ఎస్.వినోద్ పనితనం అని చెప్పోచ్చు.
Producer& Direction :
ఇప్పటిదాకా మనం తెలుగులో ఫ్యాక్షన్ కథలు చాలా వచ్చాయి. మిర్చి’లో కొరటాల శివ ఇంకొంచెం ముందుకెళ్లి యుద్ధాన్ని ఆపడానికి హీరో చేసే ఒక ప్రయత్నాన్ని చూపించాడు. త్రివిక్రమ్ రాయలసీమ నేపథ్యంలో ఇదివరకు ఎవరూ టచ్ చెయ్యని కథతో, బలమైన పాత్రలతో ఎన్టీఆర్‌ మార్క్‌ మాస్‌ ఎలిమెంట్స్‌ కూడా మిస్‌ అవ్వకుండా జాగ్రత్త పడ్డాడు. త్రివిక్రమ్‌ గత చిత్రాలతో పోలిస్తే ఎంటర్‌టైన్మెంట్‌ కూడా తక్కువే. త్రివిక్రం డైలాగ్స్, మాటలు మాత్రం ఎప్పటిలాగే తన సినిమా స్థాయిని పెంచేసాయి. మొత్తం మీద ఈ చిత్రం ఎన్టీఆర్ అభిమానులను మాత్రమే కాకుండా, మంచి కథ కోసం సినిమాకి వెళ్ళె ఆడియన్స్ నచ్చుతుంది.
+Points :
ఎన్.టి.ఆర్, జగపతి బాబు ల నటన,
మొదటి 30 నిమిషాలు
ఫైట్ సీన్స్,
బ్యాగ్రౌండ్ స్కోర్
మంచి మెసెజ్
త్రివిక్రం మాటలు, డైలాగ్స్,
-Points :
కామెడి లేకపోవటం,
ఓల్డ్ స్టోరి,
For More telugu movie latest Reviews / Trailers /Teasers www.bommapadindi.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *