Nannu Dochukunduvate Telugu Movie Review | సుధీర్ బాబు అందరి మనసులు దోచుకున్నాడు…3.5/5⭐⭐⭐⭐⭐

Nannu Dochukunduvate Telugu Movie Review

Cast : సుధీర్ బాబు, నభా నటేష్, నాజర్, పృథ్వీ, తులసి, సుదర్శన్, వైవా హర్ష, జీవా – జబర్దస్త్ వేణు తదితరులు
Music : అజనీష్ లోక్ నాథ్
Cinimatography: సురేష్ రగుతు
Producer: సుధీర్ బాబు
Director-Writer : ఆర్.ఎస్.నాయుడు
నూతన దర్శకుడు ఆర్ ఎస్ నాయుడు దర్శకత్వంలో హీరో సుధీర్ బాబు తన స్వంత నిర్మాణ సంస్థ ‘సుధీర్ బాబు ప్రొడక్షన్స్’ పై హీరోగా నటిస్తూ ‘నన్ను దోచుకుందువటే’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. Nannu Dochukunduvate Telugu Movie Review.  తాజాగా నిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెట్టి తానే స్వయంగా నటిస్తూ నిర్మించిన సినిమా నన్ను దోచుకుందువటే.ఇటీవల సమ్మోహనంతో సూపర్‌ హిట్ కొట్టిన సుధీర్‌ బాబు ఈ సినిమాతో మరో విజయం అందుకున్నాడా..? తొలిసారిగా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన ఈ యంగ్ హీరో ఏ మేరకు ఆకట్టుకున్నాడు..?(bommapadindi)
కథ :
కార్తీక్ (సుధీర్ బాబు) ఒక ఐటీ కంపెనీలో మేనేజర్. పని విషయంలో స్ట్రిక్ట్‌గా ఉండే కార్తీక్‌ అంటే ఆఫీస్‌లో ఎంప్లాయిస్‌ అందరికీ భయం. ఎప్పుడు ఎవరిని ఉద్యోగం నుంచి తీసేస్తాడా అని అంతా భయపడుతూ పనిచేస్తుంటారు. కానీ తన గోల్ కి అడ్డుగా అన్నట్టు అతనికి అతని పేరెంట్స్ పెళ్లి సంబంధాలు చూస్తుంటారు. ఈ సమయంలో కొన్ని పరిస్థితుల కారణంగా కార్తీక్‌ తన తండ్రి(నాజర్‌)తో ఓ అబద్ధం చెప్పాల్సి వస్తుంది. కాలేజీలో చదువుతూ షార్ట్ ఫిలిమ్స్ చేసే మేఘన (నభా నటేష్) కార్తీక్ తండ్రిని నమ్మించడానికి అతడి ప్రేయసిగా నటించడానికి ఒప్పుకుంటుంది. కానీ మేఘనతో ఎక్కువ సమయం గడుపుతుండటంతో కార్తీక్‌కు ఆఫీస్‌లో ఓ సమస్య ఎదురవుతుంది. దీంతో తన గోల్‌కు దూరమవుతున్నా అన్న భయంతో మేఘనను దూరం పెడతాడు. అసలు కార్తీక్ తన గోల్ రీచ్ అవుతాడా ? చివరికి కార్తీక్ మేఘన ఎలా కలుసుకుంటారు ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.
విశ్లేషణ – సాంకేతిక వర్గం
సుధీర్ బాబు ఈ సినిమాలో కొత్త లుక్ తో ఫ్రెష్ గా కనిపించాడు. తన ఇమేజ్‌కు తగ్గట్టుగా రొమాంటిక్‌ కామెడీతో అలరించాడు. తన కింది స్థాయి ఉద్యోగుల్ని వేయించుకునే తినే బాస్ గా సుధీర్ పాత్ర ఆరంభంలో సినిమాపై మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుంది. నాభ నటేష్ కూడా తన స్క్రీన్ ప్రెజెన్స్ తో గ్లామర్ తో బాగానే ఆకట్టుకుంది. పాత్రకు తగ్గట్లు నభా నటన కూడా బాగా కుదరడంతో ఆమెతో ముడిపడ్డ సన్నివేశాలన్నీ మెప్పిస్తాయి. ప్రత్యేకంగా కామెడీ ట్రాకులేమీ లేకుండా.. సందర్భానుసారంగా వినోదం పండించడం మెప్పిస్తుంది. సురేష్‌ సినిమాటోగ్రఫి సినిమాకు రిచ్‌ లుక్‌ తీసుకువచ్చింది. అజనీష్‌ లోక్‌నాథ్‌ సంగీతం కూడా సినిమాకు పర్ఫెక్ట్‌ గా సెట్ అయ్యింది. సుధీర్ బాబు సంస్థ నిర్మాణ విలువల్లో రాజీ పడలేదు. సినిమాకు అవసరమైన మేర ఖర్చు చేసింది. దర్శకుడు ఆర్ ఎస్ నాయుడు రాసుకున్న కథను అందంగా స్క్రీన్ మీద ఎగ్జిక్యూట్ చేసే ప్రయత్నం చేశారు. కాకపొతే ఆయన కథనం పై ముఖ్యంగా రెండువ భాగం పై ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది.
+Points :
నటన – క్యారక్టర్
కామెడి బాగానె ఉంది
ఎమోషనల్ సీన్స్
– Points:
సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా ఉంది

For More Telugu Movie Reviews www.bommapadindi.com 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *