Nota Movie Review | నోటా కి తెలుగు ప్రేక్షకుల ఓటు పడలేదా!!2.25/5⭐⭐⭐⭐⭐

Nota Movie Review

Tittle : నోటా
Cast : విజయ్‌ దేవరకొండ, సత్యరాజ్‌, నాజర్‌, మెహరీన్‌
Music : సామ్‌ సీయస్‌
Producer : జ్ఞానవేల్‌ రాజా
Director : ఆనంద్‌ శంకర్‌
అర్జున్ రెడ్డి, గీతా గోవిందం రెండు సినిమాలతో తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరో విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ హీరో నటించిన ఈరోజే రిలీజ్ అయిన చిత్రం “నోటా”. జ్ఞానవేల్ రాజా సగర్వంగా నిర్మించిన “నోటా” మూవీ , ఏ మేరకు తెలుగు ప్రేక్షకులను ఆదరించిందో Nota Movie Review  చుద్దాం.(bommapadindi)
కథ :
వరుణ్‌ (విజయ్‌ దేవరకొండ) ముఖ్యమంత్రి వాసుదేవ్‌(నాజర్‌) కొడుకు. వాసుదేవ్ ఒక కేసులో జైలుకు వెళ్లాల్సి రావడంతో అప్పటిదాకా విదేశాల్లో ఉండి ఇండియాకు తిరిగొచ్చిన తన కొడుకుని ముఖ్యమంత్రిని చేస్తాడు. వరుణ్ తన తండ్రి ఆదేశాల ప్రకారం డమ్మి ముఖ్యమంత్రిగా మేనేజ్ చేస్తుంటాడు. కానీ ఓ కేసులో వాసుదేవ్‌కు శిక్షపడటం, బెయిల్‌పై తిరిగి వస్తుండగా వాసుదేవ్‌ మీద హత్యా ప్రయత్నం జరగటంతో వరుణ్ సొంతంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కొన్ని విపత్కర పరిస్థితుల్లో అతను ముఖ్యమంత్రి పాత్రను సీరియస్ గా తీసుకుంటాడు. కాగా ఆ తర్వాత జరిగే పొలిటికల్ డ్రామాలో వరుణ్ కి ఎదురైనా సమస్యలు ఏమిటీ ? మరి వీటిని వరుణ్ ఎలా ఎదుర్కొన్నాడు.. ముఖ్యమంత్రిగా తనదైన ముద్ర ఎలా వేశాడు అన్నది మిగతా కథ.
నటీనటులు – విశ్లేషణ :
HERO:
విజయ్ ఓ యంగ్ సీఎం గా చాలా స్టైలిష్ గా ఫ్రెష్ గా కనిపించాడు. రౌడీ సీఎం పాత్రలో పర్ఫెక్ట్‌ గా సూట్‌ అయ్యాడు. ఓ పొలిటికల్‌ డ్రామాకు విజయ్‌ దేవరకొండ లాంటి నటుణ్ని ఎంచుకోవటం సాహసం అనే చెప్పాలి. విజయ్ నటన, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌, ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ ఇలా ఫస్ట్‌ హాఫ్ సూపర్బ్ అనిపిస్తుంది‌.
Heroin:
జర్నలిస్ట్ పాత్రలో నటించిన హీరోయిన్ మెహ్రీన్ కు ఆమె పాత్ర సపోర్టింగ్ రోల్ కే పరిమితమైంది.
Others:
సత్యరాజ్ తన నటనతో ఆకట్టుకుంటారు. నాజర్ తన గాంభీరమైన నటనతో, హీరో ఫ్రెండ్ గా కమెడియన్ ప్రియదర్శి , మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే చేసారు.
Music:
పాటలు అంతగా బాగాలేకపోయిన, బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది.
Cinematography:
సంతాన కృష్ణన్ ఛాయాగ్రహణం బాగుంది.
Producer:
నిర్మాణ విలువలు బాగున్నాయి.
Director:
విజయ్ దేవరకొండ ఎంత బాగా పెర్ఫామ్ చేసినప్పటికీ.. అతడిని ముఖ్యమంత్రి పాత్రలో ప్రభావవంతంగా చూపించడంలోనూ దర్శకుడు విఫలమయ్యాడు. Nota Movie Review దర్శకుడు ఆనంద్ శంకర్ రాజకీయాలకు సంబంధించి కథను తయారు చేసుకున్న, తెలుగు నేటివిటీకి అనుగుణంగా ఇంకొన్ని మార్పులు చేసి ఉంటే బాగుండనిపిస్తుంది. ఫస్టాఫ్ ఇంటర్వెల్ బ్యాంగ్, సెకెండ్ హాఫ్ లో ఒకటి, రెండు సీన్లు తప్ప పెద్దగా ఆకర్షించే సీన్లు కనబడలేదు. సత్యరాజ్, నాజర్ ల మద్య వచ్చే ట్విస్ట్ కుడా ముందుగానే తెలిసిపొతుంది. నోటా సినిమాని మాత్రం తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేయటంలో దర్శకుడు విఫలం అయ్యాడనే చెప్పోచ్చు.
+Points: విజయ్ దేవరకొండ నటన
ఇంటర్వెల్ బ్యాంగ్,
బ్యాగ్రౌండ్ స్కోర్.
-Points:
తెలుగు నెటివిటి లేదు,
సాంగ్స్ బాలేవు,
దమ్ము ఉన్న సీన్లు లేవు
For More Tolly wood Movie Reviews click :  www.bommapadindi.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *