“NTR”బయోపిక్ లోకి ఎంట్రి ఇవ్వనున్న “నారా చంద్రబాబునాయుడు” “కె.సి.ఆర్”, “ఏఎన్నార్”

“NTR”బయోపిక్

‘విశ్వవిఖ్యాత నట సార్వభౌమా నందమూరి తారకరామారావు’ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘ఎన్టీఆర్’ బయోపిక్ చిత్రం.(బొమ్మపడింది) తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం తెలాంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాత్రను కూడా ఈ సినిమాలో చూపించనున్నారు. స్వతహాగా కేసీఆర్, ఎన్టీఆర్ కి వీరాభిమాని. అయితే కేసీఆర్ పాత్రలో ఎవరు నటించనున్నారో తెలియాల్సి ఉంది. దర్శకుడు క్రిష్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి అక్కినేని నాగేశ్వరరావుగారి పాత్రలో ఆయన పెద్ద మనవడు సుమంత్ నటిస్తున్నారని విషయం అందరికి తెలిసిందే. ఏఎన్నార్ చనిపోయే ముందు ఆయన చివరిగా ఉపయోగించిన కారులో సుమంత్ షూటింగ్ ప్రదేశానికి వచ్చారట. ఏఎన్నార్ కారులో ఏఎన్నార్ గెటప్ లో వచ్చిన సుమంత్, అచ్చం ఏఎన్నార్ లానే ఉన్నారని చిత్రబృందం చెబుతుంది.  ఇది ఇలా ఉంటె ఆంధ్రప్రదేశ్ సి.యం, ఎన్ టి ఆర్ అల్లుడు అయిన నారాచంద్రబాబు నాయుడు గారి పాత్ర ఈ సినిమాలో కీలకపాత్ర పోషించబోతొంది. కాగా ఆ పాత్రను యంగ్ హిరో “దగ్గుపాటి రానా” పోషిస్తున్నారు. ఈ రోజు వినాయక చవితి సందర్భంగా పోస్టర్ ను రిలీజ్ చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *