Taxiwaala Movie Review | ‘టాక్సీవాలా’ మూవీ రివ్యూ

Taxiwaala Movie Review | ‘టాక్సీవాలా’ మూవీ రివ్యూ Rating 3/5
Cast: విజయ్‌ దేవరకొండ, ప్రియాంక జవాల్కర్‌, మాళవికా నాయర్‌, కళ్యాణీ, ఉత్తేజ్‌
Music : జాక్స్‌ బెజోయ్‌
Producer : ఎస్‌కేయన్‌
Director : రాహుల్ సాంక్రుత్యాయన్‌
నోటా సినిమాతో నిరాశపరిచిన విజయ్‌ దేవరకొండ ఈ సినిమా టాక్సీవాలా సినిమాతో హిట్ కొడుదామనుకొన్న నేపథ్యంలో సినిమా మొత్తం ఇంటర్నెట్‌లో పైరసీకి గురై0ది. సినిమా రిలీజ్‌ కన్నా చాలా రోజుల ముందే ఆన్‌లైన్‌ లో రిలీజ్ కావటంతో రిజల్ట్‌ ఎలా ఉండబోతుందన్న ఆందోళనలో ఉన్నారు చిత్రయూనిట్‌. ప్రియాంక జవాల్కర్, మాళవిక నాయర్ హీరోయిన్లుగా , కొత్త దర్శకుడు రాహుల్ సంకృత్యన్ రూపొందించిన ఈ థ్రిల్లర్ మూవీ విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ:
శివ (విజయ్ దేవరకొండ) ఐదేళ్లలో అతి కష్టం మీద డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం కోసమని హైదరాబాద్ వస్తాడు. ముందు ఒకటి రెండు జాబ్స్‌ ట్రై చేసిన వర్క్‌ అవుట్ కాకపోవటంతో క్యాబ్‌ డ్రైవర్‌గా పని చేయాలనకుంటాడు. అతడి దగ్గరున్న తక్కువ డబ్బులకు పాతికేళ్ల ముందు నాటి పాత కారు మాత్రమే వస్తుంది. టాక్సీ తొలి రైడ్‌లోనే (ప్రియాంక జవాల్కర్) అను అమ్మాయితో ప్రేమలో పడతాడు. అంతా హ్యాపీగా సాగుతుందనుకున్న సమయంలో ఆ టాక్సీలో దెయ్యం ఉందని తెలుస్తుంది. ఇంతకీ ఆ దయ్యం కథేంటి.. దానికి కారుకు సంబంధమేంటి.. ఈ దయ్యం గొడవ నుంచి బయట పడటానికి శివ ఏం చేశాడు.. అన్నది మిగతా కథ.
నటీనటులు:
Hero:
అర్జున్ రెడ్డి’ తర్వాత ‘గీత గోవిందం’లో మాదిరేపాత్రలో అతను సులువుగా ఒదిగిపోయాడు. శివ పాత్రను తన నటన, హావభావాలతో మరో లెవెల్‌కు తీసుకెళ్లాడు. తన యాటిట్యూడ్‌తో ఆకట్టుకున్నాడు. ప్రీ క్లైమాక్స్ ముందు వచ్చే సీన్లలో అద్భుతంగా నటించాడు.
Heroine:
ప్రియాంక జవాల్కర్‌ది పెద్దగా ప్రాధాన్యం లేని పాత్ర. హీరోయిన్‌గా ప్రియాంక గ్లామర్‌ రోల్‌ లో ఆకట్టుకుంది. తెరపై చాలా ఫ్రెష్‌గా కనిపించింది.
మాళవిక నాయర్‌కు మరోసారి నటనకు ఆస్కారం ఉన్న పాత్ర దక్కింది.
Others: హీరో ఫ్రెండ్‌గా నటించిన మధుసూదన్‌ మంచి కామెడీ టైమింగ్‌తో నవ్వించాడు. సిజ్టూ, ఉత్తేజ్ విలన్ షేడ్ ఉన్న క్యారెక్టర్లలో కనిపించారు. వి ప్రకాశ్, కల్యాణి పాత్రలు సెంటిమెంట్‌ను గుప్పించాయి.
Cinimatography:
సుజిత్‌ సారంగ్‌ సినిమా మూడ్‌కు తగ్గ విజువల్స్‌తో మెప్పించాడు.ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ సినిమాటోగ్రఫి.
Music:
జేక్ బిజోయ్ నేపథ్య సంగీతం.. పాటలు సినిమాలకు బలంగా నిలిచాయి.
Producer – Director:
గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మాణ విలువలకు తగ్గట్టుగా ఉంది. పీఆర్‌వో ఎస్‌కేఎన్ నిర్మాతగా క్వాలిటి అవుట్ పుట్ అందించారు. దర్శకుడు రాహుల్ హార్రర్ థ్రిల్లర్లను బాగా డీల్ చేయగలనని చాటుకున్నాడు. అనుకున్న కథను తెర మీద చూపించటంలో విజయం సాధించాడు.
సూపర్‌ నేచురల్‌, సైన్స్‌ ఫిక్షన్‌ అంశాలతో తయారు చేసుకున్న లైన్‌ కావటంతో లాజిక్‌ల గురించి మాట్లాడుకోవటం అనవసరం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *